ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిన జగన్ రెడ్డి – దోమకొండ అశోక్

విజయవాడ, ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగుల ఓట్ల కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తానని, వైఎస్స్సార్సిపి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానని వారి నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి గారు, వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ సిపిఎస్ రద్దు చేయలేదు. సిపిఎస్ రద్దు చేయాలని ఓపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1వ తారీకు సీఎం జగన్ ఇంటిని ముట్టడిస్తామని పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాల వారిని వారి ఉద్యమాన్ని అణచివేయడానికి, ఉద్యోగులపై బైండోవర్ కేసులు పెడతామని బెదిరించడం, వారితో బలవంతపు సంతకాలు తీసుకోవడం, వారి సొంత వాహనాలు స్వాధీనం చేసుకోవడం, ఉద్యోగులను ఎక్కించుకుంటే మీ మీద కేసులు పెడతామని టాక్సీ డ్రైవర్లని,ఆటోడ్రైవర్ల ని బెదిరించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రజాస్వామ్యంలో తమ హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రశ్నించే హక్కు, ఉద్యమం చేసే హక్కు ప్రతి పౌరుడికి ఈ రాజ్యాంగం కల్పించింది. ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఉద్యోగులు కూల్చివేయడం ఖాయం, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు చేస్తానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు జనసేన పార్టీ అండగా నిలబడుతుంది అని జనసేన నాయకులు దోమకొండ అశోక్ తెలియజేశారు.