మానవత్వాన్ని చాటుకున్న బోడపాటి శివదత్

పాయకరావుపేట, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బాధితురాలికి ఇరవై వేల రూపాయల సహాయం అందించి వారికి అండగా నిలబడి తదనంతరం ప్రమాదానికి గురై సంవత్సరం పాటు మంచానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితిలో ఉన్న జనసైనికుడి కుంటుంబానికి పది వేల రూపాయల సహాయన్ని అందించి వారికి అండగా నిలబడిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు పాయకరావుపేట జనసేన పార్టీ ఇంచార్జ్ శివదత్ బోడపాటి. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేన ఉండాలి అన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్దాంతాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తున్న శివదత్ కి ఆ ప్రాంతంలో ఉన్న జనాలు బ్రహ్మరథం పడుతున్నారు.