నిరాశ్రయుల వసతి గృహంలో జనసేన నాయకుల భోజనాల పంపిణి

పార్వతీపురం, జనసేనాని జన్మదిన వారోత్సవాలు సందర్భంగా గురువారం పార్వతీపురంలో నిరాశ్రయుల వసతి గృహంలో నియోజకవర్గ నాయకులు భోజనం పంపిణి చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల్ని అమలు చేయటంలో ఏమాత్రం వెనకాడబోమని నాయకులు చెప్పటం జరిగింది. ఆ వసతి గృహ యాజమాన్యం సహాయం చేసినందుకు నాయకులకు ధన్యవాదాలు తెలిపి, జనసేనాని ఆరోగ్యాంగా ఉండాలని కోరుకుంటున్నాం అని చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు పైల సత్యన్నారాయణ, ఖత విశ్వేశ్వరరావు, గణేష్, బాలు, గౌరీ, మణి, భాస్కర్ మరియు వీరమహిళలు గోవిందమ్మ, మణి, లక్ష్మి పాల్గొన్నారు.