Razole: ఉక్కు కార్మికుల సభను విజయవంతం చేయాలి

ఈ నెల 31 వ తేదీన విశాఖపట్టణంలో ఉక్కు కార్మికులకు అండగా జరగబోతున్న పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభకు నియోజకవర్గానికి సంబంధించి ఛలో వైజాగ్ కోసం గుండుబోగుల పెద్దకాపు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన స్టేట్ జాయింట్ సెక్రటరీలు దిరిశాల బాలాజీ, తాడి మోహన్, జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల రవికిరణ్, మలికిపురం ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి, చిరంజీవి సేవా సమితి గౌరవ అధ్యక్షులు రావి మురళి మరియు మూడు మండలాల ఎంపీటీసీలు, జనసైనికులు పినిశెట్టి బుజ్జి, శెట్టెం శ్రీనివాస్ పాల్గొన్నారు.