కూకట్ పల్లి నియోజకవర్గంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

కూకట్ పల్లి నియోజకవర్గంలోని కె.పి.హెచ్.బి 114 మరియు బాలాజీ నగర్ 115 డివిజన్ ప్రెసిడెంట్లు కొల్లా శంకర్, దుర్గా శ్రీనివాస్ ఆధ్వర్యంలో రమ్య గ్రౌండ్ వద్ద జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం కిజనసేన పార్టీ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి మండలి దయాకర్ అతిథిగా వచ్చి కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా డివిజన్ ప్రెసిడెంట్లు కొల్లా శంకర్ మరియు దుర్గా శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత అర్ధరాత్రి 12 గంటల నుండి నూతన సంవత్సర వేడుకల వలె జన సైనికులు మరియు అభిమానులుకాలనీలో ప్రతి ఒక్క వీధి వీధిలో అత్యంత వైభవంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయము అని.. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇరు డివిజన్ నాయకులు అంజి (కేబుల్), చరణ్, డాక్టర్ సత్యనారాయణ ‘వెంకట్, వంశీ కృష్ణ, వెంకటేష్ గణేష్ మరియు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *