కపిలేశ్వర స్వామి ఆశీస్సులతో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం ప్రారంభం

తిరుపతిలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అరణి శ్రీనివాసులుకు జీవకొన ప్రజలు బ్రహ్మరధం పట్టారు. జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ నాయకత్వంలో శనివారం తిరుపతి ఉమ్మడి అభ్యర్థి అరణి శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా అభ్యర్థి అరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక నగరం తిరుపతి ని అభివృద్ధి బాట పట్టించాలంటే తమను గెలిపించాలని కోరారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కాంక్షించి టీడీపీ, బీజేపీ లతో కలిసి రాష్ట్రంలో రాక్షస పాలన అంతానికి పూనుకున్నారన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ తమ ప్రార్టీ అధినేత ప్రజల బాగుకోసం మాత్రమే కొన్ని మెట్లు తగ్గారన్నారు. ఉమ్మడి అభ్యర్థి విజయమే రాష్ట్రంలో ఆరాచక పాలనకు చరమగీతం పాడుతుందన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయమే తమకు శిరోధార్యం అన్నారు. అధినేత నిర్ణయించిన వ్యక్తిని తిరుపతి నుంచి గెలిపించి కానుకగా ఇస్తామన్నారు. తిరుపతి జీవకోనలోని జీవలింగేశ్వరా స్వామి ఆలయం నుంచి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు ప్రజలకు ఈ 5 ఏళ్ళ రాక్షస పాలనలో బాధపడుతున్నారు వారికి అండగా జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు ఎక్కమయ్యాయి. ప్రజల శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పని చేసి రాష్ట్ర ప్రజలకు మేలుచేస్తాం అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మోహన్, టీడీపీ నాయకులు కోడూరు బాలసుబ్రమణ్యం జనసేన స్థానిక నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, జిల్లా కార్యదర్శులు ఆనంద్, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన జనసేన నగర నాయకులు వార్డ్ ఇంచార్జ్లు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.