‘భం భోలే’ పాట విడుదల
అక్షయ్ కుమార్ కీలక పాత్రలో’కాంచన’కు రీమేక్‌గా రాఘవ లారెన్స్ రూపొందించిన చిత్రం ‘లక్ష్మి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబరు 9న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూసిన అభిమానులు, బాలీవుడ్ నటులు అక్షయ్ నటనకు ఫిదా అవుతున్నారు.
తాజాగా ‘లక్ష్మి’లో ‘భం భోలే’ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో హిజ్రాగా అక్షయ్ ఎర్రచీర కట్టుకుని అర్ధనారీశ్వర విగ్రహం ఎదుట చిందులు వేస్తూ కనిపించారు. ఇందులో అక్షయ్ నటన చూసి అందరూ ఆశ్చరపోతున్నారు. తెలుగు/తమిళ భాషల్లో లారెన్స్ ఈ పాటకు డ్యాన్స్ చేశారు. ‘విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన’ అంటూ సాగే ఆ పాట థియేటర్లో ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు అక్షయ్ ఈ పాట చిందేస్తూ అదరగొట్టారు. మరి అక్షయ్ నటన విశ్వరూపం మీరూ చూసేయండి.