కరోనా విజృంభణ .. అమెరికాలో రోజులో లక్ష కేసుల నమోదు

అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే ఒక రోజులో అత్యధికంగా లక్ష కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ ఆవిర్భవించినప్పటీ నుంచి ఈ స్థాయిలో కేసులు రాలేదని ఎన్ బీ సీ డేటా చెబుతోంది. ఇదివరకు 98 వేల కేసులు వరకు ఉండగా.. ఆ రికార్డు బ్రేక్ అయ్యింది.

98 వేల 583 కేసులు ఇప్పటివరకు ఒక రోజులో అత్యధిక కేసులు ఉన్నాయి. బుధవారం అదీ లక్ష 4 వేల 429కి చేరింది. కరోనా వైరస్ సోకి ప్రపంచంలో ఇప్పటి వరకు 2 లక్షల 35 వేల మంది చనిపోయారు. మిస్సౌరి, ఓక్లాహయా, ఇండియా, నెబ్రాస్కా, నార్త్ డకోటా, న్యూ మెక్సికోలో చాలా కేసులు పెరుగుతున్నాయి. లొవా, మిస్సౌరొలో ఆస్పత్రిలో మోతాదుకు మించి రోగులు చేరుతున్నారు. ఇల్లినాయిస్, ప్లోరిడా, న్యూయార్క్‌లో గత వారం రోజుల నుంచి కరోనా వైరస్ క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆందోళన నెలకొంది.