మూడు సంవత్సరాలకి కళ్యాణమస్తు పథకం గుర్తురావడం హాస్యాస్పదం

విజయవాడ, అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయిన తరువాత ముఖ్యమంత్రికి వైఎస్సార్ కళ్యాణమస్తు పథకం గుర్తురావడం హాస్యాస్పదమని జనసేన పార్టీ నాయకులు దోమకొండ అశోక్ అన్నారు. కళ్యాణమస్తు పథకానికి 10వ తరగతి పాస్ అయి ఉండాలని కండిషన్స్ పెట్టిన వైసిపి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాను.
అక్టోబర్ 2 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నాం మన్న కళ్యాణమస్తు పథకాన్ని, గడిచిన మూడు సంవత్సరాలలో పెళ్లి చేసుకున్న పేదింటి ఆడబిడ్డలకు అమలు చేయరా? వారికి వర్తించదా? జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి! అమ్మబడి కావాలి అంటే కండిషన్స్ అప్లై, చేయూత కావాలి అంటే కండిషన్స్ అప్లై, జగన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇలా పేద ప్రజలకు ఇచ్చే పథకాలకు అర్థం లేని కండిషన్స్ అప్లై పెట్టారు. జగన్మోహన్ రెడ్డికి సూటి ప్రశ్న: మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కండిషన్స్ లేకుండా ఏ ఒక్క పథకం అయినా సరే పేద ప్రజలకు అందిందా? అని సూటి ప్రశ్న వేస్తున్నా అని అన్నారు.