నిరుపేద ఆటోకార్మికుడి కొడుకుకి చదువు నిమిత్తం జనసేన ఆర్ధికసహాయం

ప్రత్తిపాడు నియోజకవర్గం, గుంటూరు రూరల్ మండలం, చినపలకలూరు గ్రామంలోని బొందలపాటి శ్రీనివాసరావు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు, ఆయనకు ఇధ్ధరు కుమారులు వారిలో మొదటి కుమారుడు ఈ సంవత్సరం కాలేజీలో చేరాల్సి ఉంది. కానీ ఆయన దగ్గర ఫీజు కట్టడానికి డబ్బులు లేవని దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేయాలి అని కోరగా దానికి స్పందించిన జనసేన పార్టీ నాయకులు జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు యడ్ల వెంకటేశ్వరరావు, గుంటూరు రూరల్ మండల కార్యదర్శి ముళ్ళపూడి చిన్నా ఈ సంవత్సరానికి సరిపడ ఫీజు నిమిత్తం 10000/- ఆర్ధికసహాయం చేశారు. ఈ సహాయాన్ని యడ్ల వెంకటేశ్వరరావు ఇవ్వడం జరిగినది. భవిష్యత్తులో కూడా ఈ అబ్బాయి చదువు నిమిత్తం జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియచేయటం జరిగినది.