హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ములకలపల్లి జనసేన వినతిపత్రం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, ములకలపల్లి మండలంలో మండల వ్యాప్తంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయని స్థానిక జనసేన పార్టీ నాయకుల దృష్టికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రామ్ తాళ్ళూరి ల ఆదేశాల మేరకు జనసేన పార్టీ తరఫున ములకలపల్లి మండలంలో ప్రజల అనారోగ్య స్థితిగతులపై స్థానిక వైద్యాధికారిణి ఉదయ లక్ష్మికి తెలియపరచ వలసిందిగా మండల కమిటీని ఆదేశించడం జరిగింది. ఇట్టి ఆదేశాలనుసారం జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ వైద్య అధికారిణి ఉదయ లక్ష్మిని కలిసి మండల వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న అనారోగ్య పరిస్థితుల గురించి తెలియపరచి వారికి జనసేన పార్టీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్ మాట్లాడుతూ మండలంలో మారుమూల గ్రామాలలో ప్రతి కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు అనారోగ్యంగా ఉన్నారని, మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించాలని వారికి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు స్పందించి మండల వ్యాప్తంగా హెల్త్ క్యాంపులు ప్రతి గ్రామంలో నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం సెక్రటరీ గరికే రాంబాబు, ఉమ్మడి ఖమ్మం విద్యార్థి విభాగం కార్యనిర్వాహక సభ్యులు గొల్ల వీరభద్రం, మండల కార్యదర్శి బొక్క వెంకటేశ్వర్లు మరియు చిర్ర భద్రం తదితరులు పాల్గొన్నారు.