ఆత్మీయ సమావేశానికి పిలుపునిచ్చిన బొమ్మిడి నాయకర్

హైదరాబాద్, సెప్టెంబర్ 18వ తేదీన హైదరాబాద్ లో నివసిస్తున్న నరసాపురం నియోజకవర్గ ప్రజలు మరియు జనసేన కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం సాయంత్రం 5 గంటలకు శ్రీ కృష్ణ గార్డెన్స్, ప్రగతినగర్, హైదరాబాద్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పిఏసి సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ పిలుపునిచ్చారు.