కృష్ణంరాజుకు ఘననివాళులు అర్పించిన జనసేన కౌన్సిలర్లు

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యు వి కృష్ణంరాజు సంతాప సభ అమలాపురం గడియార స్తంభం సెంటర్లో ఉన్న పురపాలక వేదికపై జరిపారు. పురపాలక వైస్ చైర్మన్ రుద్రరాజు వెంకట రాజు (నాని రాజు) ఆధ్వర్యంలో ఈ సంతాప సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పురపాలక ప్రతిపక్ష జనసేన నేత యేడిద వెంకటసుబ్రహ్మణ్యం, కౌన్సిలర్లు పిండి అమరావతి, గండి దేవి హారిక, గొలకోటి విజయలక్ష్మి, నాయకులుగండి స్వామి, గొలకోటి వాసు, తిక్కా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.