ఆత్మకూరులో పవనన్న ప్రజాబాట 12వ రోజు

ఆత్మకూరు, సుమారు 80 టీ.ఎం.సీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు నియోజకవర్గంలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో సింహభాగం భూములు మెట్ట భూములుగానే ఉండడానికి కారణం ఏమిటి? నియోజకవర్గంలోనే సోమశిల జలాశయం ఉన్నప్పటికీ, నియోజకవర్గంలోని అన్ని చెరువులకు సాగునీటి సౌకర్యం కల్పించే భాగ్యం ఎప్పుడు? ఒక్కసారి ఆలోచించండి. సోమశిల జలాశయం నుండి పక్క రాష్ట్రమైన తమిళనాడుకు, పక్కనున్న చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు మరియు నెల్లూరు జిల్లాలోని తూర్పు ప్రాంతానికి సాగు, తాగు నీటి వసతులు కల్పించబడ్డాయి. కానీ నియోజకవర్గంలోని సింహభాగం భూములకు ఇప్పటికీ సాగునీరు లభించేందుకు ఎటువంటి ప్రణాళికలు రూపొందించలేదు. రూపొందించిన వాటికి నిధులను మంజూరు చేయని కారణంగా అవి మూలనపడ్డాయి. ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని చెరువులకు మరియు గ్రామాలకు సాగు, తాగు నీటి సదుపాయాలు కల్పించాలంటే నియోజకవర్గ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి గల జనసేన పార్టీకే ఓటు వేయాలని ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ తెలిపారు. 12వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని జ్యోతి నగర్ మరియు వీవర్స్ కాలనీలో పర్యటించి అక్కడి ప్రజల ఇబ్బందులు తెలుసుకుని, వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా భరోసా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వీవర్స్ కాలనీలో ప్రజల కనీస అవసరాలు అయిన రోడ్లు మరియు డ్రైనేజీ సౌకర్యాలు కూడా కల్పించకపోవడం ఎంతో శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వంశీ, చంద్ర, సురేష్, చైతన్య, పవన్, వెంకటేష్, హజరత్, నాగరాజా, సునీల్, అనిల్, భాను తదితరులు పాల్గొన్నారు.