ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వంపురు గంగులయ్య

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యురు మండలం, జనసేన పార్టీ కొయ్యురు మండల నాయకులు, లక్ష్మణ్, బుజ్జిబాబు, నాని, సిద్ధు వంటి నాయకులు ప్రాతినిధ్యం వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పాడేరు అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డా.వంపురు గంగులయ్య హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది, మన ప్రాంతం లాంటి గిరిజన ప్రాంతంలో ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉందని అన్నారు. కార్పొరేషన్ నిధులు మాయం చేశారు. ఉద్యోగులకు వేధింపులు, సర్పంచ్ ల అధికారులకు కత్తెర గిరిజనులకు విద్యకు దూరం పెంచుతున్నారు. ఇలా అనేకరంగాల్లో మోసం చేస్తూనే ఉన్నారు. మాటిడితే సమస్యల నుంచి ప్రజా ఆలోచన దృష్టి మల్లింపులో భాగంగా కొత్త సమస్య సృష్టిస్తున్నారు. జాబ్ కాలెండర్ లేదు, భాష వలంటీర్లను తొలగింపు, ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వర్కర్లను రద్దు చేశారు ఫలితంగా స్కూల్స్ లో బాల, బాలికల మరణాలు పెరుగుతోంది. ఇవాళ ఈ కొయ్యురు మండలంలో పరిశీలిస్తే రోడ్ల సమస్యలు అధికంగా ఉంది. అధికార, ప్రతిపక్షాలు మేము గొప్ప చేసామంటే కాదు మేమే అభివృద్ధి చేశామని పొట్లాడుకుంటున్నారు. నిజానికి ప్రజలకు కావాల్సింది వీళ్ళ వీధి పోరాటాలు కాదు విధాన దృక్పధంతో కూడిన అభివృద్ధి కావాలి. అది మరిచి ఉనికి చాటుకొనే చౌకబారు ప్రయత్నం చేస్తూ ప్రజాభిమానం పొందలనుకుంటున్నారు. గిరిజన ప్రజలు కాలంతో పాటు చాలా వేగంగా మార్పును స్వాగతిస్తున్నారని తెలియదు కాబోలు, సవాల్ కి ప్రతి సవాల్ విసురుతూ సమస్యల సవాళ్ళను తీర్చకుండా వీధి నాటకాలు చేస్తూ సోషల్ మీడియాలలో ఎంటర్ టైన్ చేస్తున్నారని విమర్శించారు. గ్రామస్థాయి అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చారని, సర్పంచ్ ల అధికారలకు అడ్డుపడి గ్రామాల అభివృద్ధికి నిరోధకంగా మారారని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. కొయ్యురు మండల నాయకులు లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజలారా మనమంతా నిజాయితీగా ఓటు వేసి జనసేన పార్టీని గెలిపిస్తే సుస్థిర అభివృద్ధి సాధ్యామని తద్వారా యువత భవిష్యత్ బాగుంటుందని కొయ్యురు మండల నాయకులంతా జనసేన పార్టీ బలోపేతానికి కట్టుబడి ఉన్నామని మనమంతా మార్పు కోసం స్వాగతం పలకాలని ఉద్గాటించారు. ఈ సమావేశంలో పాడేరు అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్చార్జ్ డా.వంపురు గంగులయ్య, చింతపల్లి మండల నాయకులు వాడకని నాని, పుండరీనాద్, పాడేరు నాయకులు అశోక్ సాలేబు, మజ్జి సత్యనారాయణ, మజ్జి సంతోష్, కొయ్యురు మండల నాయకులు లక్ష్మణ్, సాగినా బుజ్జిబాబు, సిహెచ్.సిద్ధు, జె సూర్యప్రకాష్, పి రాజేష్, పి రాంప్రసాద్, సెగ్గే నాని తదితర జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు.