షాదీమందిర్ ని పునఃప్రారంభంచండి: చప్పిడి శ్రీనివాసల రెడ్డి

కోవూరు నియోజకవర్గం పడుగుపాడు పంచాయతీ పరిధిలో ఉన్నటవంటి షాదీ మందిర్ ని ఆదివారం కోవూరు మండల అధ్యక్షులు షేక్ అల్తాఫ్ ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు చప్పిడి శ్రీనివాసలరెడ్డి, మరియు జిల్లా నాయకులు, మండల నాయకులు సందర్శించారు. ఈ సందర్బంగా శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ ఈ షాదీ మందిర్ చూసి చాలా బాధ వేసింది అని అన్నారు, ముస్లిం, మైనారిటీలు అంటే మాకు అభిమానం అని చెప్పి వైసీపీ వాళ్ళు ఎన్నికల టైం లో దొంగ ప్రేమ్ ని ఒలగపోసి ముస్లిం మైనారిటీల ఓట్లు వేపించుకొని మోసం చేస్తున్నారు గత 10 సంవత్సరల నుండి ఈ షాదీ మందిర్ శిధిలా వివస్థ కి చేరింది. గత ప్రభుత్వం లో కూడా ఇలానే మోసపురితమైన మాటలు చెప్పి కోవూరు ముస్లిం మైనారిటీ ప్రజలను మోసం చేశారు. ఈ షాదీ మందిర్ 1999 సంవత్సరం లో శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారే ప్రారంభం చేశారు. ఇప్పుడు మాత్రం అది శిధిలా వివస్తకి చేరింది. దయచేసి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి జనసేన పార్టీ ద్వారా విన్నవించుకుంటున్నాం. షాదీ మందిర్ ని పునః ప్రారంభం చేయండి. పేద ముస్లిం మైనారిటీలు చిన్న చిన్న శుభాకార్యాలయాలు చేసుకోవాలింటే లక్షలు లక్షలు వెచ్చేంచి లేక ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ షాదీ మందిర్ ని ఏర్పాటు చేసి ముస్లిం మైనారిటీ వాళ్లకి అందుబాటులోకి తీసుకోని రావాలి అని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ముల్లా మున్వర్ బాషా గారు మాట్లాడుతూ మా ముస్లిం మైనారిటీలను వైసీపీ వాళ్ళు మోసం చేస్తున్నారు, ఈ షాదీ మందిర్ ని గత ప్రభుత్వం కూడా ఇలానే మాయమాటలు చెప్పి ఓట్లు వేపించుకొని తరువాత గాలికి వదిలేసారు, రేపు ఉదయం ఈ సమస్య పై సంబందించిన అధికారులుకు వినతి పత్రాలు అందుచేస్తాం ఈ షాదీ మందిర్ ని ఈ ప్రభుత్వం లో బాగుచేయక పొతే రానున్న ది మన జనసేన పార్టీ ప్రభుత్వం మా ప్రభుత్వం లో ఈ షాదీ మందిర్ ని ప్రారంభం చేస్తాం అని అన్నారు రానున్న రోజుల్లో ముస్లిం మైనారిటీ వాళ్లకి జనసేన పార్టీ ద్వారా నే న్యాయం జరిగింది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, సూరయ పాలెం పవన్ కుమార్, కోవూరు మండలం అధ్యక్షులు షేక్ అల్తాఫ్, మహేష్, సాయి, మురళి, తన్మాయ్ తదితరులు పాల్గొన్నారు.