వంట గ్యాస్ సిలిండర్ పేలుడు బాధిత కుటుంబానికి అండగా బండారు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ బుధవారం మూలస్థానం గ్రామంలో వంటగ్యాస్ సిలండర్ పేలిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుల కూడా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి వారి కుటుంబాలకు ఓదార్పు నుంచి ధైర్యం చెబుతూ కొంత ఆర్థిక సహాయం కింద వారికి అందజేసి, పేలుడు బాధిత క్షతగాత్రులను, ఏ విధంగానైనా ప్రాణాలు నిలబెట్టాలని డాక్టర్లను కోరడం అక్కడ పలువురు చుట్టుపక్కల వారిని కంటతడి పెట్టించింది. చాలా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న తీవ్రమైన కండిషన్ లో ఉన్న వారిని కాపాడే విధంగా ప్రయత్నించడం ఎంతో గొప్ప విషయమని వారి పరిస్థితి విషమించిందని కన్నీటిని దిగమింగుకుంటూ, బాధిత కుటుంబాలను ఓదార్చి వారి వెంట తిరిగి ప్రయాణమై మూలస్థానం అగ్రహారం వచ్చి, ఆ బాధ్యత కుటుంబ సభ్యులను బంధువులను మహిళలను కలిసి వారికి ఎంతో ఓదార్పునిచ్చారు. పొద్దుపోయే వరకు కూడా వారిని వారి కుటుంబాన్ని వదిలిపెట్టకుండా పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు వారి ఇంటి యందే అక్కడే ఉండి వారికి మనోధైర్యాన్నివ్వడం జరిగింది.