రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి జనసేన ఆర్థిక సహాయం

బొబ్బిలి నియోజకవర్గం, తెర్లాం మండలం, బూర్జవలస గ్రామానికి చెందిన రాంచరణ్(14) ఇటీవల హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు, బూరిపేట, బూర్జవలస, గ్రామ జనసైనికులు విషయం మండల జనసేన కార్యనిర్వహన కమిటీకి తెలియజేయడంతో, జనసైనికులు, మండల నాయకులు శనివారం బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం జనసేన పార్టీ తరుపున రూపాయలు 10,000/- నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మరడాన రవి, ఆర్.పి రాజు, రాజు, ఆర్కే నాయుడు, ఉమామహేశ్వరావు, ప్రవీణ్, రెడ్డి లక్షమునాయుడు, ప్రసాద్, బూరిపేట జనసైనికులు బొత్స రమణ, సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భ్మగా ఈ కార్యక్రమానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు.