సరిహద్దుల్లో సైన్యంతో కలిసి దీపావళి వేడుక జరుపుకున్న ప్రధాని

ప్రధాని మోదీ భారత సైన్యంతో కలిసి సరిహద్దుల్లో దీపావళి పండుగను జరుపుకున్నారు. శనివారం జైసల్మేర్‌ చేరుకున్న మోదీ లోంగేవాలా పోస్ట్‌ సరిహద్దులో భారత జవాన్లతో కలిసి పండుగ చేసుకున్నారు.. ఈసందర్భంగా జవాన్లకు మిఠాయిలు పంపిపెట్టారు. సరిహద్దుల్లోఆక్రమణలకు పాల్పడుతున్న పాక్‌, చైనాకు ఆయన పరోక్ష హెచ్చరికలు జారీచేశారు.. తమ దేశ సహనాన్ని పరీక్షిస్తే ధీటైన జవాబు చెబుతామని హెచ్చరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్‌లోని 139 కోట్ల ప్రజానీకం రక్షణకోసం నిరంతరం పాటుపడుతున్న జవాన్లు దేశంకు అండగా ఉన్నారని అన్నారు. జవాన్లతో ఎంత సేపు గడిపితే అంత ఎక్కువగా ఈ దేశానికి సేవ చేయాలనే తన కాంక్ష బలోపేతం అవుతోందని అన్నారు.