దళిత వీరమహిళ మందా సూర్యవతికి అండగా జనసేన
అమలాపురం రూరల్ మండలం నడిపూడి గ్రామంలో దళిత వీర మహిళ మందా సూర్యవతి ఇల్లు కోల్పోయి నిరాశ్రయురాలు అవడంతో బుధవారం స్థానిక జనసైనికుల సహకారంతో ఇల్లు మరమ్మత్తు చేయించుకోవడానికి నియోజకవర్గ ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు చేతుల మీదుగా కొంత ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకున్న నడిపూడి గ్రామ జనసైనికులు దళిత మహిళ ఇంటి మరమ్మత్తులకు ఆర్థిక సహాయం చేయడం చాలా ఆనందంగా ఉందని, జనసైనికులు ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తారు అని అన్నారు. అదేవిధంగా పార్టీ తరఫున మరికొంత సహాయం అందించడానికి తమవంతు ప్రయత్నిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి మహదశ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి చిక్కాల సతీష్, సహాయ కార్యదర్శి చిక్కం భీముడు, సీనియర్ నాయకులు సూదా చిన్నా, ఆకుల బుజ్జి, కుంపట్ల వెంకట రమేష్, సత్తి శ్రీనివాస్, గోలకోటి వెంకటేష్, పోనకల ప్రకాష్, గొర్తి పవన్, పినిశెట్టి సురేష్, బండారు కిరణ్, అరిగెల బాబీ, కుంపట్ల నాయుడు, చిక్కాల రాజేష్, అరిగెల మణికంఠ, తిరుమునాధం సాయి, వంగా సాయి, కుంపట్ల చిరు, అరిగెల నాని, ఆచంట బాలు, మందా గులాం, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-12-at-14.04.10-1024x576.jpeg)