బండారు సమక్షంలో జనసేనలో చేరికలు

  • ర్యాలీ గ్రామంలో ఎస్సి సామాజిక వర్గ యువత జనసేన పార్టీలో చేరిక.
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్.

కొత్తపేట నియోజకవర్గం, ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఎస్సి సామాజిక వర్గం నుండి యువకులు గూడపాటి శేఖర్, గూడపాటి రవికుమార్, గూడపాటి శ్రీను, రొక్కాల కోస్టర్, పాలంగి గనిబాబు, పాలంగి శ్రీను, గుడపాటి చినశేఖర్, దిడ్ల రవి, పొడుగుమాటి నాగు, గూడపాటి సుధాకర్ అలాగే ఓసి సామాజిక వర్గంలో పాటి వీరన్న, ఇండుగుల వెంకట రత్నం, ఈలి వెంకన్న జనసేన పార్టీ ఆశయాలు నచ్చి బుధవారం బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. వారి అందరికి శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. వచ్చే ఎన్నికలలో కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాం అని చెప్పడం జరిగింది.