గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో పల్లె పల్లెకు జనసేన 5వ రోజు

పాలకొండ మండలం విపి రాజిపేట గ్రామంలో జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్భాన సత్తిబాబు మరియు కురంగి నాగేశ్వరరావు (రిటైర్డ్ ఎస్బిఐ మేనేజర్) పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు మేనిఫేస్టో అక్కడి ప్రజలకు వివరించడం జరిగింది. మేనిఫెస్టోలో మహిళలకు సంవత్సరానికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి అంశాలను వివరించారు. జనసేన ప్రభుత్వం స్థాపించిన తర్వాత వ్యవసాయసాగు సాయం పథకం కింద రైతుకి ఎకరానికి 8000 రూపాయలు అలానే జనసేన అధికారంలోకి వస్తే రైతుకు 5000 రూపాయలు పెన్షన్ ఇస్తుందని ఆయన అన్నారు. రైతుల కోసం కోల్డ్ స్టోరేజీలు, వృద్ధాశ్రమాలును ప్రభుత్వమే నడుపుతుందని సత్తిబాబు అన్నారు. మరియు పలు అంశాలను వివరించారు. అలానే గ్రామంలో పలు సమస్యలను తెలుసుకొని అధికార, ప్రతిపక్ష పార్టీ వైఫల్యాలని ప్రజలకు తెలియచేస్తూ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాస్ గుర్తుపై వేసి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని జనసేన పార్టీతోనే వెనుకబడిన ఆంధ్రరాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందని రేపటి పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని మనం గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మిడతాన ప్రసాద్, గర్భాపు నరేంద్ర, ఎం.యోగేష్, ఎస్.సూర్యకిరణ్, నారాయణరావు, నరసింహ, గణేష్, నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.