రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం: బాల్యం రాజేష్

కళ్యాణదుర్గం, ఆంధ్రప్రదేశ్ రైతులను వంచనకు గురి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు దినోత్సవం పేరుతో రైతులను మరోసారి మోసగించడానికి కళ్యాణదుర్గంకి రావడం సిగ్గుచేటని, వైసిపి ప్రభుత్వం నాలుగు సంవత్సరాలలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. జీడిపల్లి నుండి నియోజకవర్గంలో 114 చెరువులను నింపుతూ కుందుర్పి బ్రాంచ్ కెనాల్ కలుపుతూ బిటీపి కి నీళ్లు తీసుకెళ్లే ప్రాజెక్టును వైసిపి సర్వనాశనం చేసిందన్నారు. 92 కిలోమీటర్లు కెనాల్ తవ్వాల్సి ఉండగా ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. సామాగ్రి తుప్పు పట్టిపోయిందని ఒక్క పంప్ హౌస్ నిర్మించారా…? అని నిలదీశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసిపి చేసిన అభివృద్ధి శూన్యమని, నాలుగేళ్లలో మంత్రి సాధించింది చెరువు కబ్జాలు, 100 ఎకరాలలో తను ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకోవడమే అని సీఎం దాన్ని ప్రారంభిస్తే మంచిదని ఎద్దేవా చేశారు. రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం రైతు దినోత్సవం నిర్వహించడం దారుణం అన్నారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం ఎకరాకు పదివేలు ఇస్తున్నారని, వైసిపి ప్రభుత్వం సంవత్సరానికి 6000 ఇచ్చి రైతులను పండుగ చేసుకోమనడం సిగ్గుచేటు అన్నారు. జిల్లాలో అధికంగా సాగు చేస్తున్న వేరుశెనగ రైతులకు సరైన బీమా ఇవ్వకుండా దగా చేయడం వాస్తవం కాదా అన్నారు. హంద్రీనీవా కాలువను 5000 క్యూసెక్కులకు పెంచి సమాంతరంగా మరో ఐదు వేల క్యూసెక్కుల కాలువ తవ్విస్తాను అన్న హామీ ఏమైందని నిలదీశారు. కేసుల భయంతోనే కర్ణాటక అక్రమంగా నిర్మిస్తున్న అప్పర భద్ర, నవలి ప్రాజెక్టులను వ్యతిరేకించలేదన్నారు. వైసిపికి చిత్తశుద్ధి ఉంటే తుంగభద్ర కాలువను అధునీకరణ తోపాటు తుంగభద్ర వరద సమాంతర కాలువ తవ్వాలన్నారు. అకాల వర్షాలు వల్ల నష్టపోయిన అరటి, మిర్చి మొక్కజొన్న రైతులను ఏమాత్రం పట్టించుకోలేదు అని ఈ సందర్భంగా తెలియజేశారు. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ని చూస్తేనే వైసిపి నాయకులకు భయం పట్టుకుంటుంది ఎందుకంటే వారు అవినీతిలో నిత్యం జీవిస్తూ ఉన్నారు కాబట్టి జనసేన పార్టీకి ఎన్నికల కమిషన్ గాజు గ్లాసు గుర్తును కేటాయించిందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యేకి ఈ మాత్రం తెలియక ఏదేదో మాట్లాడుతున్నారని బాల్యం రాజేష్ తెలియజేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని రైతులు యువత ఉపాధి లేక పక్క రాష్ట్రం బెంగళూరుకి వలసలు వెళ్తున్న విషయం మీకు తెలియదా? వచ్చి ఎన్నికల్లో మీకు టికెట్టు రాదు వచ్చిన గెలిచే అవకాశం లేదు అని హెచ్చరించారు. ఎందుకంటే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మీరు చేసినది ఏమీ లేదు అని ఓటర్లు సామాన్య ప్రజలు అందరికీ తెలిసినదే అని తెలియజేశారు.