తాలుకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు

ఎమ్మిగనూరు, మెగాస్టార్ మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరంతేజ్ 36వ జన్మదిన వేడుకలు ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక వేదాస్ వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వేదాస్ వృద్దాశ్రమంలో ఉన్న వారందరికి అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్, కార్యదర్శి భరత్ సాగర్, సీనియర్ మెగా ఫ్యాన్స్ కరణం రవిలు మాట్లాడుతూ నేటి తరం యువత అభిమానాన్ని సంపాదించుకున్న అసలు సిసలైన హీరో సాయి ధరమ్ తేజ్, అని మెగాస్టార్ ఫ్యామిలీ మెంబర్ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకున్నాడని కొనియాడారు. సాయి ధరమ్ తేజ్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని రాబోయే రోజుల్లో ఆయన చేపట్టబోయే సేవా కార్యక్రమాల్లో అయితేనేమి సినిమాల్లో అయితేనేమి ఘనవిజయం సాధించి మెగా అభిమానుల్ని సినీ ప్రేక్షకుల్ని మారింతగా అలరిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రమేష్, చైతన్య, గురు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.