శీతాకాలం సందర్భంగా కేదార్‌నాథ్‌ ఆలయం మూసివేత

ఉత్తరాఖండ్‌లోని ప్రఖాత్య జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయాన్ని మూసివేశారు. శీతాకాలం సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని ఈ ప్రముఖ ఆలయంలో ఈ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి.. గం.8.30లకు మూసివేశారు. అంతకు ముందు ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగీ ఆదిత్యనాథ్‌, తివేంద్రసింగ్‌ రావత్‌, దేవస్థానం బోర్డు సభ్యులు స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగాలలో కేదార్‌నాథ్‌ ఒకటి. ఆలయం ప్రపంచ నలుమూలల నుంచి భక్తులను ఆకర్షిస్తోంది. హిమాలయాల్లో ఉన్న కేదార్‌నాథ్‌లో ఆదివారం నుంచి మంచు కురవడం ప్రారంభమైంది. అలాగే బ్రదీనాథ్‌ ఆలయం ప్రాంతంలోనూ మంచు కురవడం ప్రారంభమైంది. మంచు వర్షంలో ఆలయం ఎదుట భక్తులు సందడిగా గడిపారు.