బీహర్ సీఎంగా నితీశ్ కుమార్ బాధ్యతల స్వీకరణ

బీహర్ రాజకీయాల్లో నితీష్ కుమార్ చరిత్ర సృష్టించారు. ఏడవసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వరుసగా నాలుగో సారి ఆయన సీఎం బాధ్యతలను స్వీకరించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. ఎన్డీఏ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీహార్ సీఎం అభ్యర్థిగా ఏన్డీఏ కూటమి తరపున నితీశ్ కుమార్ పోటీ చేశారు. పాట్నాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ ఫాగూ చౌహాన్ .. నితీశ్ కుమార్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ నేతలు తార్‌కిషోర్ ప్రసాద్‌, రేణు దేవీలు.. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు.