తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక.!

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక కోసం తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. టీడీపీ తరపున తిరుపతి లోక్‌సభ స్థానానికి పోటీచేసి ఓడిపోయిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మళ్లీ పోటీ చెయ్యనున్నట్లుగా ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆమె టీడీపీ వీడి బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వస్తుండగా.. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆమెనే బరిలోకి దిగుతారని లోకసభ నియోజకవర్గం పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రకటించారు. వైసీపీ సిట్టింగ్‌ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కరోనా వైరస్‌తో మరణించగా.. ఖాళీ అయిన సీటుకు.. జనవరి తర్వాత ఎప్పుడైనా ఉప ఎన్నిక జరగవచ్చు. ఈ క్రమంలో అన్ని పార్టీలు అభ్యర్ధులపై దృష్టి పెట్టగా.. SC రిజర్వుడు సీటు కావడంతో ముందుగానే చంద్రబాబు అభ్యర్ధి ప్రకటన చేశారు.