ఏపీలో న్యూ ఇయర్ వేడుకలు రద్దు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలు రద్దు చేయాలని నిర్ణయించింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ వస్తోందని నిపుణులు చెబుతోన్న నేపథ్యంలో.. ఏపీ ముందు జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది.

డిసెంబర్ 31 అంటేనే మమూలు ఊపు ఉండదు. కొత్త ఏడాదికి ఘనంగా వెల్ కం చెప్పాల్సిందే. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కరోనా ఎఫెక్ట్ న్యూ ఇయర్‌పై కూడా పడింది. దీంతో ఆ రెండు రోజులు పాటు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ తరహా ఆంక్షలు అమలు చేస్తారు. రాష్ట్రంలో వైన్ షాపులు, బార్లు తెరిచి ఉంచే వేళలను కూడా తగ్గించారు.