సంగం మండల ఎంపిడిఓకి జనసేన వినతిపత్రం

ఆత్మకూరు, మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నా మౌళిక సదుపాయాలు కూడా లేని పరిస్థితి. పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి మాత్రం శూన్యం. జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆత్మకూరు నియోజవర్గ ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో సంగం మండలం దువ్వూరు గ్రామపంచాయతీ నందు మూడు మేజర్ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద బుధవారం సంగం మండలంలో ఎంపిడిఓకి వినతిపత్రం ఇవ్వడం జరిగినది.

వినతిపత్రంలో పేర్కొన్న సమస్యలు

  • సంగం మండలంలోని దువ్వూరు గ్రామపంచాయతీ నందు 20 వేల నుంచి 30 వేల లీటర్ల సామర్థ్యం గల త్రాగునీరు వాటర్ ట్యాంక్ ను నిర్మించండి.
  • దువ్వూరు నందలి చిన్న బలిజ పాలెం నుంచి ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు వెళ్ళుటకు సిమెంట్ రోడ్డును మంజూరు చేయవలసిందిగా మనవి.
  • దువ్వూరు గ్రామంలో ఉన్న కొత్త చిలిక కాలువ పూడికను తీసి, కొత్త చిలిక కాలువని కాంక్రీట్ రూపంలో నిర్మించాలి.
    *త్రాగునీరు వాటర్ ట్యాంక్ సమస్య: త్రాగునీరు నిలవ చేసే వాటర్ ట్యాంక్ లేకుండా ఉండటం వల్ల గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కరెంటు ఉంటేనే మోటర్ల సహాయంతో పంచాయితీ కుళాయిల ద్వారా పంచాయితీ నీరు గ్రామ ప్రజలకు అందుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వంలో కరెంట్ కోతులు ఎక్కువగా ఉండడం వల్ల త్రాగునీరు అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ త్రాగునీరు సమస్య పోవాలంటే దువ్వూరు గ్రామం నందు త్రాగునీరు వాటర్ ట్యాంక్ ను నిర్మించాలని మనవి.
  • రోడ్డు సమస్య: దువ్వూరు గ్రామం చిన్న బలిజ పాలెం నుండి ప్రభుత్వ ప్రాథమికో న్నత పాఠశాల వరకు సిమెంట్ రోడ్డు మరియు డ్రైనేజ్ లేక ప్రజలు మరియు విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దువ్వూరు చుట్టుపక్క గ్రామాలైన అనసూయనగర్, అరుంధతివాడ, మక్తపురం దువ్వూరు గ్రామంలోని సుమారు 350 మంది విద్యార్థులు ఈ రహదారి ద్వారా ప్రాథమికోన్నత పాఠశాలకి వెళ్లాలి. ఈ రహదారి బురద, గుంతలు మయంగా మారడంతో ప్రజలు మరియు విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కావున ఈ రహదారికి సిమెంట్ రోడ్డును మంజూరు చేయవలసిందిగా మనవి.
  • కాలువ సమస్య: కొత్తచిలిక కాలువ మీద దాదాపు 100 ఎకరాలు పైచిలుకు వ్యవసాయం చేసే రైతులు ఆధారపడి ఉన్నారు. ఈ కాలువ పూడిక తీయకుండా ఉండటం వల్ల ప్రతి సంవత్సరం వర్షాకాలంలో 50 ఎకరాలు పైగా వరి పొలాలు నీట మునగడం జరుగుతుంది. అంతేకాకుండా దువ్వూరు గ్రామంలోని వివిధ ఏరియాలో నుంచి డ్రైనేజ్ మీరు ఈ కాలువలో కలుస్తాయి ఈ కాలువ పూడిక తీయకుండా ఉండటం వల్ల నీరు పోయే సదుపాయం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ కాలువలోని నీరు నిలవ ఉండటం వల్ల గ్రామ ప్రజలకు దోమల వలన విష జ్వరాలు సోకుతున్నాయి. కావున ఈ సమస్యను అధికారులు గుర్తించి కొత్తచిలక కాలువ కూడికను తీసి ఈ కాలువని కాంక్రీట్ రూపంలో నిర్మించాలి. ఈ కార్యక్రమంలో సంగం మండల జనసేన పార్టీ ఇన్చార్జ్ రాకేష్, దువ్వూరు జనసేన పార్టీ 6 వ వార్డ్ మెంబర్ ఆకులేటి సుధాకర్, గురువరాజు, మస్తాన్ బాబు, రాజేష్, వంశీ, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.