పోలీసులకు యావత్ ప్రజానీకం ఋణపడి ఉంటుంది: ఆళ్ళ హరి

గుంటూరు, సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షిస్తూ, అనుక్షణం ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడే పోలీసులకు యావత్ ప్రజానీకం ఋణపడి ఉంటుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ ఉత్సవాల్లో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీనివాసరావుతోటలోని సీతారామ విద్యాలయంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, పెన్నులు, పెన్సిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ప్రజలకి ఏ కష్టం వచ్చినా, ఎలాంటి ఆపద కలిగినా భగవంతుడు కన్నా ముందు గుర్తుకువచ్చేది పోలిసేనన్నారు. ఏ ఉద్యోగంలో అయినా సెలవులు ఉంటాయి కానీ పోలీసు వ్యవస్థలో ఒక్క క్షణం కూడా విరామం ఉండదన్నారు. ప్రపంచానికి సూర్యుడు ఎంత అవసరమో సమాజానికి పోలీస్ అంత అవసరమని కొనియాడారు. విధి నిర్వహణలో అసాంఘిక శక్తుల చేతిలో అమరులైన పోలీసుల త్యాగాలు, సేవలు అజారామరమైనవన్నారు. పోలీసులకు అండగా నిలుస్తూ కర్తవ్య నిర్వహణలో తోడుగా నిలిచే పోలీసు కుటుంబ సభ్యులకు ప్రజలంతా సదా ఋణపడి ఉంటారని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో కోనేటి ప్రసాద్, మెహబూబ్ బాషా, వడ్డె సుబ్బారావు, దొంత నరేష్, ఇళ్ల చిరంజీవి, పురాణం కుమారస్వామి, దాసరి రాము తదితరులు పాల్గొన్నారు.