సబ్ కలెక్టరుకు వినతిపత్రమిచ్చిన మార్కాపురం జనసేన

మార్కాపురం, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి ఇమ్మడి కాశీనాథ్ అదేశాల మేరకు మార్కాపురం పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు, అలాగే భారీ వాహనాలు సమయ పాలన లేకుండా పట్టణంలోకి రావడం వల్ల ట్రాఫిక్ సమస్యగా మారింది. మైనర్లు
ఆటోలు, ద్విచక్ర వాహనాలు అతివేగంగా నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అలాగే మూగ జీవులైన ఆవులను గాయపరుస్తున్నారు. దీని గురించి ఆర్డీవో కార్యాలయంలో సబ్ కలెక్టర్ ని కలిసి వివరించి వినతిపత్రమివ్వడం జరిగింది. సబ్ కలెక్టర్ సెధు మాధవన్ ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ నూనె సురేష్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు వీరిశెట్టి శ్రీనివాసులు, చలపతి, దిలీప్ పాల్గొన్నారు.