పవన్ కళ్యాణ్ కోసం ఎంతవరకైనా వెళతాం: గుడివాక శేషుబాబు

అవనిగడ్డ, నా పిల్లలకు ఎటువంటి సదుపాయాలు కావాలన్నా నేను కల్పించుకోగలను, కానీ నా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మంచి సమాజం ఉండాలి, అందులో వారికి చోటు కల్పించాలంటే మనం మంచి సమాజాన్ని నిర్మించాలని, రాష్ట్ర ప్రజలకు కావలసింది పాతిక కేజీల బియ్యం కాదు పాతిక సంవత్సరాల భవిష్యత్తు అని చెప్పే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, కల్పించక పోవడం చూస్తుంటే కావాలనే పవన్ కళ్యాణ్ కు హాని తలపెట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నట్లు అర్దం అవుతోందని అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ సంధించే ప్రశ్నలకు ప్రత్యక్షంగా సమాధానం చెప్పలేని వైసీపీ సర్కార్ ఆయనకు భద్రత కల్పించకపోగా, ఇటీవల కాలంలో వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురిచేయడం మనందరం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా వైజాగ్ లో జరిగిన అరాచకం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరువక ముందే హైదరాబాదులో పవన్ కళ్యాణ్ నివాసం ఉండే ఇల్లు మరియు పార్టీ ఆఫీస్ పరిసర ప్రాంతాలలో గుర్తుతెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించడాన్ని బట్టి చూస్తే ఆయనకు ప్రాణహాని ఉన్నట్లు సామాన్య పౌరునికి కూడా అర్థమవుతుందని, జనసైనికులు చూస్తూ ఊరుకోరని, పవన్ కళ్యాణ్ ను కాపాడుకోవడానికి ఎంతవరకు అయినా ముందుకు వెళ్తామని ఆయన హెచ్చరించారు. అధికారం కోసం సొంత బంధువులను కూడా పట్టించుకోని మనస్తత్వం, చిరంజీవి లాంటి వ్యక్తి నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం కూడా చేయక పైశాచిక ఆనందం పొందే సైకో లాంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో సమాజం కోసం, ప్రజల బాధలను తీర్చడం కోసం గొంతు ఎత్తి ప్రశ్నించే పవన్ కళ్యాణ్ లాంటి వారికి రక్షణ ఉంటుంది అనుకోవడం తీరని కోరికే అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా పోలీసుల చేత భయపెట్టాలని చూసిన ఈ ప్రభుత్వం అది వల్లకాక ప్రత్యక్ష దాడులతో పవన్ కళ్యాణ్ కి హాని తలపెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు మనకు తెలుస్తుందని, పవన్ కళ్యాణ్ మీద ఏ విధమైన దాడి జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత జనసైనికుల అందరి మీద ఉందని, పవన్ కళ్యాణ్ బయటికి వెళ్లిన ప్రతి సందర్భంలో ఆయనకు చుట్టూ జన సైనికులు వలయంలా ఏర్పడి రక్షణ కల్పించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం ఎలాగూ పవన్ కళ్యాణ్ రక్షణ విషయం గాలికి వదిలేసిందని, కేంద్ర ప్రభుత్వం అయినా ఈ విషయంలో కలుగ చేసుకొని వెంటనే జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేయవలసిందిగా అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అవనిగడ్డ మండల జనసేన నాయకులు గుడివాక శేషుబాబు చెప్పారు.