జనసేనాని భద్రత కొరకు భోగాపురం సి.ఐ కి వినతిపత్రం

విజయనగరం జిల్లా, గత నెల 15 వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో వారికి ప్రాణహాని ఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ తెలియజేసినప్పటికీ రాష్ట్ర డిజిపి పట్టించుకోలేదని మేము భావిస్తూ ఉన్నాము. అలాగే బుధవారం రాత్రి తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో ఆయనపై రెక్కీ నిర్వహించి ఆయన నివాసం వద్ద మరియు గత మూడు రోజులుగా ఆఫీస్ వద్ద ఆయన ఫాలో చేస్తూ రెక్కీ చేస్తున్నారు కాబట్టి మా అధినేత పై పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందని మేము భావిస్తున్నాము. ఇప్పటికైనా రాష్ట్ర డిజిపి నిఘావర్గాలను అలెర్ట్ చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్లో ఆయన పర్యటనలో ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని మా అధినేతకు రక్షణ కల్పిస్తారని ప్రార్థిస్తున్నాం. అలా జరగనియెడల పవన్ కళ్యాణ్ కి గాని ఆయన చిటికెన వేలుకైనా చిన్న గీత పడినా జనసైనికుల ఆగ్రహాన్ని చవిచూస్తారని భోగాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మి రాజ్, బూర్ల విజయ శంకర్, దిండి రామారావు, పతివాడ అచ్చం నాయుడు, పిన్నింటి రాజారావు, సూర్యప్రకాష్, రామారావు, మాదేటి ఈశ్వరరావు బుజ్జి, లింగం రమేష్, తుమ్మి అప్పలరాజు దొర, బలభద్రుని జానకిరామ్ కుమార్, పిన్నింటి అప్పలనాయుడు(పండు), బుత్తల రామారావు తదితరులు పాల్గొన్నారు.