అయినవిల్లి రాజుకు అండగా తణుకు జనసేన

తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం కత్తవపాడు గ్రామానికి చెందిన జనసైనికుడు అయినవిల్లి రాజు కరెంట్ షాక్ గురై ఒక కాలు చెయ్యి కోల్పోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు మరియు కత్తవపాడు జనసేన పార్టీ నాయకులు అయినవోలు రాజును పరామర్శించి కట్టవపాడు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆర్థిక సహాయం 12,500 మరియు తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి విడివాడ రామచంద్రరావు 7500 మొత్తం గాను 20 వేల రూపాయలు బాధితులు అయినవిల్లి రాజుకి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరగవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశీ, మరియు తణుకు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు చిక్కాల వేణు, తణుకు టౌన్ అధికారి పంతం నానాజీ మరియు కత్తవపాడు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.