‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ జనసేన సామాజిక పరిశీలన

రాజాం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పిలుపు మేరకు పేదలు ఇల్లు జగనన్న మోసం కార్యక్రమంలో భాగంగా రాజాం నియోజకవర్గం, రాజాం మండలం, కంచరాం గ్రామాలకు దూరంగా కనీసం మౌళిక వసతులు లేని ప్రాంతంలో పేదలకు ఇళ్ళు పట్టాలిచ్చి నిర్మాణం చేయాలని చేతకాని ప్రభుత్వానికీ బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఇకనైనా పేదల గృహాలు ప్రభుత్వమే కట్టించాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తూ మొదటి రోజు కార్యక్రమంలో రాజాం నియోజకవర్గ నాయకులు ఎన్ని రాజు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.