పొన్నలూరు మండలంలో అవినీతి అగ్రస్థానం, అభివృద్ధి శూన్యం

  • పొన్నలూరు మండల పేద ప్రజలకు సమాధానం చెప్పాలి.. వరికూటి అశోక్ బాబు, బెజవాడ వెంకటేశ్వర్లు, కొండాబత్తిన మాధవరావు

కొండేపి నియోజకవర్గం: నవరత్నాల పేర్లతో ప్రజలను ఈ వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుంది. నవరత్నాల్లో ఒక రత్నమైన పేదలందరికీ ఇల్లు, జగనన్న కాలనీలు, అధికారంలోకి రాగానే దాదాపు 30 లక్షల ఇల్లు పేదలకు కట్టిస్తాం అని వైసిపి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికీ దాదాపు మూడున్నర సంవత్సరం గడిచిపోయింది, కేవలం రాష్ట్ర మొత్తంలో లక్షన్నర ఇల్లు మాత్రమే కట్టించారు. అందులో లబ్ధిదారులకు చేరింది 70 వేల ఇల్లు మాత్రమే. జగనన్న కాలనీ పేరుతో భూమిని కొనుగోలు చేయడానికి దాదాపు 28 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది ఈ వైసీపీ ప్రభుత్వం అని ఈ వైసీపీ నాయకులే చెబుతున్నారు. మరి ఆ డబ్బులన్నీ ఎటుపోయాయి.. ఎవరి జేబులు నింపుకున్నారు. పేద ప్రజల పొట్టను కొట్టారు. మీరు నిజంగా ఖర్చు చేసి ఉంటే పేద ప్రజలకు ఇప్పటివరకు ఎందుకు ఇల్లు కట్టించలేకపోతున్నారు. మీరు ఇచ్చిన జగనన్న కాలనీలో సరైన రోడ్లు లేవు, విద్యుత్ సదుపాయం లేదు, తాగునీటి సదుపాయం లేదు, వర్షం వస్తే మూడు అడుగులు మునిగిపోయే పరిస్థితి, మరి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు , ఇదంతా ఒక పెద్ద స్కాం, పేదవాడిని అడ్డుపెట్టి, పెద్దవాళ్లు చేస్తున్న పెద్ద స్కాం ఇది, కొన్ని వందల కోట్ల రూపాయలు భూమి పేరిట మట్టితోలి, చదును చేసి, వాగుల్లో, వంకల్లో, గుంటల్లో, స్మశానాల్లో, ఇచ్చి వందల కోట్ల రూపాయలు ఈ వైసిపి నాయకులు జేబుల్లో వేసుకున్నారు. జీవో నెంబరు 8 మరియు 9 ప్రకారం 2020 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం రెండు దశల్లో ఇల్లు నిర్మించి పేదలకు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో 67 వేల ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేశారు. 10 లక్షల ఉన్న భూమిని 60, 70 లక్షలకు పెట్టి కొనుగోలు చేశారు. జగనన్న కాలనీల పేరుతో ల పొన్నలూరు మండలం వైసిపి నాయకులు క్షల్లో దోచుకున్నారు. పొన్నలూరు మండలంలో అభివృద్ధి మాత్రం శూన్యం, అవినీతి మాత్రం అగ్రస్థానంలో ఉంది, పొన్నలూరులో ఒక్కొక్క ఎకరం 5 లక్షలు విలువ చేసే చోట 10 నుండి 15 లక్షలు వరకు కొనుగోలు చేసి పేదవారిని దోచుకుంటున్నారు, మండలాన్ని నాశనం చేస్తున్నారు, వైసిపి నాయకులు మాత్రం అభివృద్ధి చెందుతున్నారు, పేదవాళ్లు ఇంకా పేదరికంలోకి పోతున్నారు. పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు బ్రతికెందుకు పొన్నలూరు మండలంలో అవకాశం లేకుండా పోతుంది, కింద గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు అందరూ మండలాన్ని దోచుకుంటూ ఉన్నారు. భూకబ్జాలు, దందాలు, నకిలీ మద్యం, నాడు నేడు, జగనన్న కాలనీలు, ఇలా ప్రతి విషయంలో మండలాన్ని దోచుకుంటూ దాచుకుంటున్నారు, ప్రజాధనాన్ని ఈ వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా దొరికినకాడికి దోచుకుంటూ పొన్నలూరు మండలాన్ని సర్వనాశనం చేస్తున్నారు. వైసిపి అవినీతి రాష్ట్రానికి తెలిసేలాగా జగనన్న మోసం పేరుతో జనసేన సోషల్ ఆడిట్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ అండగా ఉంటుంది. ఇప్పటివరకు పొన్నలూరు మండలంలో ఒక్క ఇల్లు కూడా పూర్తిచేసి పేదవాడికి ఇచ్చింది లేదు అని పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. జగనన్న కాలనీని సందర్శించిన వారిలో జనసేన పార్టీ నాయకులు షేక్ ఖాజావలి, కర్ణా తిరుమల్ రెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడు, శివ కిషోర్, భార్గవ్, శ్రీను, వేణు, మహేష్, వెంగళరావు, హజరతయ్యా, ధినేష్, క్రాంతి, మల్లికార్జున పాల్గొన్నారు.