ఊరవకొండ జనసేన ఆద్వర్యంలో జగనన్నఇళ్లు – పేదలందరికి కన్నీళ్లు

  • వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జగనన్న కాలనీలను సందర్శించిన జనసేన నాయకులు

ఊరవకొండ: జనసేన పార్టీ ఆధ్వర్యంలో 12,13,14 తేదీలలో నిర్వహిస్తున్న జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు అనే సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా 13వ తేది రెండవ రోజున జిల్లా కార్యదర్శ గౌతమ్ కుమార్ ,ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ ఉరవకొండ నియోజక వర్గంలోని రాయంపాల్లి రోడ్ రైస్ మిల్ దగర ఉన్న జగనన్న కాలనీని పరిశీలించి అక్కడ పరిస్థితులను ప్రభుత్వ పనితీరును తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ.. జనావాసం లేని ప్రాంతంలో పట్టణానికి 3 కిలోమీటర్ల దూరన కరెంటు సౌకర్యం, రోడ్డు సౌకర్యం, నీటి సౌకర్యం మౌలిక సదుపాయాలు లేని ప్రాంతంలో స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోమంటున్నారని అయితే ఇక్కడ ఇంకా ఇల్లులే పూర్తి కాలేదని ఇక్కడ స్థానికులను మేము అడగ్గా ఇక్కడ ప్రభుత్వం స్థలం అయితే ఇచ్చింది. కానీ మాకు బిల్లులే సరిగా పడలేదని ఇసుకతో చాలా ఇబ్బందిగా ఉందని ఇసుక కొనడానికి వేల రూపాయలవరకు ఖర్చు అవుతుందని.. అప్పుచేసి ఇల్లు కట్టుకుంటున్నామని అయితే మేము ఇంటికి అప్లై చేసుకున్నప్పుడు ఇల్లు ప్రభుత్వమే కట్టి ఇవ్వమని ఆప్షన్ ఇచ్చామని తీరా ఇప్పుడు కట్టుకుంటే మీరు కట్టుకోండి లేదంటే పట్టాని వెనక్కి తీసుకుంటామని బెదిరిస్తున్నారని పట్టా వెనక్కి తీసుకుంటారన్న భయంతో మేము ఇల్లు కట్టుకోవడం ప్రారంభించగా మాకు బిల్లులు సరిగా పడక ఇప్పుడు మా ఇంటికి లక్షల రూపాయలు అవతుందని ప్రభుత్వం ఇచ్చే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఏమాత్రం సరిపోవని వారు వాపోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్, మండల అధ్యక్షులు చంద్రశేఖర, ఉపాధ్యక్షుడు రాజేష్, ప్రధాన కార్యదర్శి మళ్లి కర్జున, వెంకీ, కార్యదర్శిల మని కుమార్, జయకుమార్, బోగేష్, ఓబులేసు, లక్షన్, తదితరులు పాల్గొనడం జరిగింది.