ఫ్లాష్ సంస్థ షెడ్డును అక్రమ కట్టడాలతో పోల్చడాన్ని ఖండించిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు: ఏలూరు, అశోక్ నగర్ లోని శ్మశాన వాటికలో ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ వారు ఏర్పాటు చేసిన షెడ్డు అప్పుడు ఉన్న ప్రభుత్వంలోని పెద్దలు అందరి ఆమోదంతోనే కట్టడం జరిగిందని రెడ్డి అప్పల నాయుడు తెలిపారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 2018 లో ఉన్నటువంటి మేయర్ గారు, ఎమ్మెల్యే గారు, మున్సిపల్ అధికారులు ఆమోదంతోనే ఆ షెడ్డు ను నిర్మించడం జరిగింది.. నిర్మించగానేంచి ఫీజర్ బాక్సులను ఎవరైతే మరణిస్తారో వారి బాడీని తరలించడానికి ప్రత్యక్ష వాహనాలు పేదవారికి అంబులెన్స్ అరేంజ్ చేయడం వంటివి అలాంటి కార్యక్రమాలు గత ఆరు సంవత్సరాల నుండి ఫ్లాష్ టీం నిర్వహిస్తూనే ఉందన్నారు.. అదేవిధంగా ఫ్లాష్ అనే సంస్థ గత 20 సంవత్సరాలుగా ఏలూరు నగరంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఇలా ఉంటే మంఘలవారం అక్రమంగా మున్సిపల్ కమిషనర్ ఆదేశంతో అక్రమ కట్టడాలు కూల్చామనే తప్పుడు ప్రచారం తోటి మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులు ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ పేపర్లో చూస్తే అర్థమైందన్నారు.. ఆ షెడ్డు అక్రమంగా ఆక్రమించి కట్టినదైతే కాదని, ఆరోజు ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే మేయర్ ఆదేశంతో నిర్మాణం చేయడం జరిగిందని, ఏలూరులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కులాలకి మతాలకి అందరికీ కూడా ఈ ఫ్రీజర్ జర్ బాక్సులు డోనర్స్ నుంచి సేకరించి ఇవ్వడం జరుగుతుందని, ఈ రోజు పేపర్లో చూస్తే అక్రమ కట్టడాలు కూల్చి వేసామని చెప్పేసి పెద్ద ప్రగర్భాలు పలుకుతున్నటువంటి అధికారులు ఇప్పటికైనా కాస్త జ్ఞానంతో ఆలోచన చేయాలని అన్నారు.. అదేమీ అక్రమ కట్టడం కాదు.. వ్యాపార సంస్థ కాదు.. అక్కడ ఆక్రమించి ఇల్లు కట్టుకున్నటువంటిది కాదు.. ప్రజలు డోనర్స్ ఇచ్చినటువంటి బాక్సులు.. స్వచ్ఛంద సంస్థగా సేకరించి వాళ్లు కూడా కాస్తా కాంట్రిబ్యూట్ చేసి ఆ ఫ్రీజర్ బాక్సులను, తరలించే వాహనాలు ఇవ్వడం జరిగిందన్నారు.. ఎందుకంటే పేదవాళ్లు పది,పదిహేను వేలు పెట్టుకొని వాహనాలు పెట్టుకోలేని పరిస్థితిలో లేనటువంటి పేదవాళ్లకి ఈ ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ ద్వారా శాంతి రధాలలో బాడీని తరలించడం, దహన సంస్కారాలు చేయించడం, అదేవిధంగా ఎమర్జెన్సీ వచ్చి వేరే ఊరు వెళ్లాలంటే అంబులెన్స్ పెట్టి ప్రమోట్ చేయడం జరుగుతుందని అన్నారు.. కానీ మున్సిపల్ అధికారులు దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఆళ్ళనాని ఆదేశాల మేరకు చేశారని అన్నారు.. ఇది చాలా దుర్మార్గమైన చర్య జనసేన పార్టీ నుండి మానవతా హృదయం కలిగిన మనుషులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు.‌. ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూల్చడంతో మొదలెట్టారు.. ఈ ప్రభుత్వం కూడా కూలిపోవడం ఖాయం అని జోస్యం చెప్పారు.. మనిషి జీవితంలో అంతిమ యాత్ర అయినటువంటి స్మశాన వాటికలో దహన సంస్కారాలు పేదవారికి కావచ్చు, కరోనా టైంలో బాడీలకు దహన సంస్కారాలు చేయడం వంటివి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు.. గత 20 సంవత్సరాలుగా స్వచ్ఛందంగా సేవలు నిర్వహిస్తూనే ఉందన్నారు.. ఏదేమైనా వ్యక్తిగతంగా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి గాని ఇలా కూల్చడం వంటివి సరైన పద్ధతి కాదని మున్సిపల్ కమిషనర్ గారు లేదా ఎమ్మెల్యే గారు మీరు నిర్మాణం చేసి ఫ్రీగా బాక్స్లు అందించాలని లేదా.. మీ సిబ్బంది ద్వారా మీరు నిర్వహించండి.. అలాగే ఎమ్మెల్యే గారు తాను సొంతంగా ఒక వేదిక పెట్టి ఫ్రీగా ఫ్రీజర్ బాక్సులు వాహనాలు సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.. మంఘలవారం జరిగిన విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని.. అక్రమ కట్టడాలు అనే పదాన్ని తొలగించాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేYఅడం జరిగింది..