జనసేన సత్తిబాబు ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

పాలకొండ నియోజకవర్గం: పార్వతీపురం మన్యం జిల్లా జనసేన సత్తిబాబు ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం. పొట్లి గ్రామనికి చెందిన దేబారికి. శంకరరావు(35) ఇతను గత కొంతకాలంగా పూర్తిగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. డాక్టర్స్ సలహామేరకు సర్జిరీ చేసి అతని శరీరం నుండి కొన్ని అవయువాలను కూడా పూర్తిగా తొలగించారు. మరల తదుపరి చికిత్స కోసం ఇటీవల హాస్పిటల్లో వైద్యుల ను సంప్రదించగా అతని యొక్క ఆరోగ్యశ్రీ కార్డును పరిశీలించి ఇదివరకే నీ చికిత్స కోసంమూడు సందర్భాలలో ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగించినందున నీయొక్క లిమిట్ పూర్తయినది కాబట్టి నీకు ఇంకా ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సపొందుటకు వీలు పడదని డాక్టర్స్ చెప్పడం జరిగింది. కావున తమ అర్దిక పరిస్థితి చూసి స్థానిక పొట్లి గ్రామ జనసైనికులు సహాయ సహకారంతో పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భన సత్తిబాబు ఆధ్వర్యంలో 17500/- రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో, పొట్లి జనసేన నాయకులు, ఆర్ ప్రసాద్, ఎం శివ, ఎం.గోవింద్, ఆర్.గోవింద్, ఎ.పండు, బి.శ్రీను, బి.రాంబాబు, మోహన్, చందు, జల్లు. సోముబాబు తదితరులు పాల్గొన్నారు.