జగనన్న ఇళ్లు పేదలందరికి కన్నీళ్లు సోషల్ ఆడిట్ వివరాల వెల్లడి

కాకినాడ గొడరిగుంటలో గల నివాసం వద్ద జరిగిన పాత్రికేయ సమావేశంలో జగనన్న ఇళ్లు పేదలందరికి కన్నీళ్లు అనే కార్యక్రమం ద్వారా చేసిన సోషల్ ఆడిట్ వివరాలు తెలియ చేసిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఈనెల 12,13,14 తేదీల్లో జగనన్న ఇళ్ల స్థలాలను పరిశీలించి అక్కడ జరుగుతున్న అవినీతిని బహిర్గతం చేయడం కోసం సర్వే నిర్వహించారు. ఇందులో వైఎస్ఆర్సిపి పార్టీ చేస్తున్న అవినీతిని మా జనసేన నాయకులు, జనసైనికులు గ్రామాల్లో గ్రౌండ్ లెవెల్లో తిరిగి వాస్తవాలు సేకరించారు. గవర్నమెంట్ రికార్డులకి, గ్రామాల్లోని వాస్తవాలకి చాలా తేడా ఉందని తెలిపారు. జగనన్న ఇళ్లు 90% పూర్తయ్యాయని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నాయకులు చెబుతున్నారు. కానీ 10 శాతం కూడా పూర్తి కాలేదని అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇళ్ల స్థలం రాలేని వాళ్ళు అదృష్టవంతులని అన్నారు. దీని మీద చర్చకు అఖిల పక్షం ఆధ్వర్యంలో చర్చకు సిద్ధంగా ఉన్నామని మీలో నిజాయితీ ఉంటే తప్పనిసరిగా బహిరంగ చర్చకు రావాలని తెలిపారు. జగనన్న ఇళ్లు కార్యక్రమం లో చాలా పెద్ద అవినీతి జరిగింది అని అన్నారు. పేదలు ఎవరూ వారిచ్చిన స్థలాల్లో ఇళ్లు కట్టుకునే పరిస్థితి లో లేరని తెలిపారు. ఇళ్లు కట్టుకుని అప్పులు పాలు అవ్వద్దని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండలం అధ్యక్షులు కర్రెడ్ల గోవిందు, పుల్ల శ్రీరాములు, సోదే ముసలయ్య, ముద్రగడ రమేష్, నల్లం శ్రీరాములు, ముమ్మిడి బుజ్జి, గంట నానిబాబు తదితరులు పాల్గొన్నారు.