ఢిల్లీలో ప్రవేశించేందుకు రైతులకు అనుమతి

ఎట్టకేలకు అన్నదాతల పోరాటం ఫలించింది. ఆందోళన చేస్తున్న రైతులను ఢిల్లీలోకి రావడానికి అనుమతిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ వర్మ తెలిపారు. అయితే రైతులు తమ నిరసనలను శాంతియుతంగా జరుపుకోవాలని అన్నారు. వారికి బురారీ ప్రాంతంలోని నిరంకారీ సమాగమం మైదానాన్ని నిరసన తెలుపుకోవడానికి కేటాయించినట్లు అలోక్ చెప్పారు. పంజాబ్‌కు చెందిన క్రాంతికారీ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు దర్శన్ పాల్ స్పందిస్తూ.. తమను ఢిల్లీలోకి అనుమతించినట్లు తెలిపారు. తాము మొదట రామ్‌లీలా మైదానంలో నిరసన తెలుపుతామని కోరినా పోలీసులు నిరాకరించారని, ఇప్పుడు తామంతా బురారీ ప్రాంతానికి వెళ్తున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ (రాజేవాల్‌) అధ్యక్షుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ చెప్పారు. రైతులను ఢిల్లీలోకి అనుమతించడాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్వాగతించారు. కేంద్రం వెంటనే రైతులతో చర్చలు మొదలుపెట్టాలని సూచించారు.