విజయవాడ నగరంలో నేర సంస్కృతి మరల జడలు విప్పుతుంది: పోతిన మహేష్

  • అవినాష్ వర్గం రౌడీయిజంకు పోలీస్ శాఖ కళ్లెం వేయలి

విజయవాడ నగరంలో నేర సంస్కృతి మరల జడలు విప్పుతుందని, దీని మూలాలు దేవినేని అవినాష్ దొడ్డి నుంచే ప్రారంభమయ్యాయ అనిపిస్తుందని దేవినేని అవినాష్ వర్గం రౌడీ ఇజం గుండాయిజం చూస్తూ పోలీస్ శాఖ ఎందుకు ఊరుకుంటుందని, అవినాష్ వర్గం రౌడీయిజంకు పోలీస్ శాఖ కళ్లెం వేయలని శనివారం జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు. నగరంలో తోట సందీప్ గ్రూపు తగాదాల మూలాలు, చెన్నుపాటి గాంధీ కంటిని పొడిచి వేయడం, కారు గుద్దించి సురేష్ అనే వ్యక్తిని మర్డర్ చేయడం, వంగవీటి రాధాకృష్ణ గారి పై రెక్కీ నిర్వహించడం నేడు అమాయక మహిళల్ని బ్లాక్మెయిలింగ్ చేస్తూ సాయి అనే మహిళ వ్యభిచారం చేయించడం, అదేవిధంగా మగవారిని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజడం ఇవన్నీ దేవినేని అవినాష్ అనుచరులు చేస్తున్న దుర్మార్గాలే నాని, వీటిని కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందని లేని పక్షంలో నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతింటాయని, ప్రశాంతంగా ఉన్న విజయవాడ నగరంలో మరల రౌడీయిజం గుండాయిజం హెచ్ రిలే ప్రమాదం స్పష్టంగా కనబడుతుందని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి అరాచకాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని వీటిపై నగర ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత దేవినేని అవినాష్ పై ఉందన్నారు. అరాచకాలే కాకుండా కబ్జాల వ్యవహారం కూడా మితిమీరిపోతుందని,కార్పొరేటర్ అరవ సత్యం కృష్ణలంక లో నిర్మించిన రిటైనింగ్ వాల్ వద్ద తొలగించిన ఇళ్లలో లబ్ధిదారులు జాబితాలో అనేకతవకలు చేశారని అందులో భాగంగా కేటాయించిన 187 ఇళ్లలో 50 నుండి 60 ఇళ్ళను అవకతవకలు చేసి మరో ఇద్దరు కార్పొరేటర్లతో కలిసి సత్యం కొట్టేసిన మాట నిజం కాదా అని, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ఇరిగేషన్ స్థలాలను కబ్జా చేసి మూడు షాపులతో కూడిన కాంప్లెక్స్ కట్టి ఒక్కో షాపు దగ్గర ఐదు లక్షల అడ్వాన్సు నెలకు 20వేల అద్దె వసూలు చేస్తున్నరని, ఇప్పటికే రెండు షాపులు అద్దెకిచ్చారని మిగిలిన ఒక్క షాపుకు ఐదు లక్షలు అడ్వాన్సు ఇచ్చే వారిని చూసుకుంటున్నారని, కార్పొరేటర్ కాపు కార్పొరేషన్ చైర్మన్.అడపా శేషు సినిమా హాల్స్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముకునే చరిత్ర మర్చిపోయారని, పవన్ కళ్యాణ్ గారి పై అనవసర విమర్శలు చేస్తు కలెక్షన్ కాలక్షేపం చేస్తున్న అడపా శేషు నేడు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలపై అవినీతి కార్యక్రమాలు పై స్పందించడం లేదని వారు స్పందించడం లేదంటే కబ్జాలకు, అరాచకాలకు, మహిళలను బలవంతంగా వ్యభిచారం కోపంలోకి లాగుతున్న అంశాలపై వారు మద్దతు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. అదేవిధంగా దేవినేని అవినాష్ వర్గం బెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి ఎనమలకుదురులో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొత్తగుళ్ల వెంకటేశ్వర స్వామికి చెందిన 85 చెట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎన్ని అంశాలపై దేవినేని అవినాష్ విజయవాడ నగర ప్రజలకు సమాధానం చెప్పాలని ఇకనుంచి అయినా వారి తీరు మార్చుకోకపోతే వారి రాజకీయ భవిష్యత్తు శూన్యం కాక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో నగర అధికార ప్రతినిధి స్టాలిన్ శంకర్, నగర కమిటీ ప్రధాన కార్యదర్శి మోబినా, కార్యదర్శులు బొట్ట సాయి, సబింకర్ నరేష్ 53 వ డివిజన్ అధ్యక్షులు పొట్నూరి శ్రీనివాసరావు, పులిచేరి రమేష్, బావిశెట్టి శ్రీనివాస్, నోచర్ల పవన్ కళ్యాణ్, మరుపిల్ల చిన్నారావు, చొక్కార నగేష్, సోమీ మహేష్ లు పాల్గొన్నారు.