వింజమూరు జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్‌కు ఘన నివాళులు

ఉదయగిరి: డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా వింజమూరు మండలంలో స్థానిక బంగ్లా సెంటర్ నందు జనసేన పార్టీ తరుపున ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు షేక్ సుభాని భాయ్, కార్యకర్తలు మురళి, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.