ప్రజలకు న్యాయం జరిగేవరకూ అండగా నిలుస్తాం: విసినిగిరి శ్రీనివాసరావు

  • కర్లాం గ్రామంలో పర్యటించన జనసేన నాయకులు విసినిగిరి
  • గ్రామంలో ప్రజా సమస్యలను గుర్తించామని, అవి పరిష్కరించే దిశగా జనసేన ముందుకెళ్తోంది..

చీపురుపల్లి: జనసేనపార్టీ నాయకులు, చీపురుపల్లి జనసేన మండల అధ్యక్షుడు విసినిగిరి శ్రీనివాసరావు చీపురుపల్లి మండలం, కర్లాం గ్రామంలో పర్యటించి, ఇంటింటికీ వెళ్లి జనసేన పార్టీ ప్రజలకు మేలుచేస్తున్న కార్యక్రమాలు, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావజాలాన్ని తెలియ పరుస్తూ.. గ్రామంలో ఉన్న ప్రజలను కలుసుకొని వారి బాగొగులు తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అమలు అవుతున్నాయా లేదా అని ఆరాతీశారు. ఈక్రమంలో బతేన అప్పయ్య, కొయ్యన లక్ష్మమ్మ అనే వృద్దులకి వారు పెన్షన్ తీసుకొనే అర్హత ఉండి కూడా వాళ్ళకు ప్రభుత్వం పెన్షన్ నిలిపివేయడాన్ని గుర్తించామని, వారిరువురూ జీవనాధారం లేకుండా నడవలేని పరిస్థితుల్లో ఉన్నా పెన్షన్ ఇవ్వకపోవడం అన్యాయమని, వారిరిరువురికీ జనసేన పార్టీ తరుపున సహాయం అందిస్తామని అన్నారు. గ్రామంలో కొన్ని సమస్యలను గుర్తించామని, ఆ సమస్యలపైన, అర్హులైన ప్రజలకు పెన్షన్లు, సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుండి సహాయం అందేలా ప్రభుత్వానికి వినతిని అందించి ప్రజలకు న్యాయం జరిగేలా జనసేన పార్టీ తరుపున పోరాటం చేస్తూ ప్రజలకు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎచ్చర్ల లక్షుం నాయుడు, రామునాయుడు, కిరణ్, శంకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.