అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసే వరకు ఉద్యమం ఆగదు.. ప్రజా సంఘాల జేఏసీ హెచ్చరిక

  • నిరాహార దీక్షలు మొదలుపెట్టిన ప్రజా సంఘాల జేఏసీ ఐక్య వేదికకు మద్దతు తెలిపిన జనసేన!

రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నమయ్య జిల్లా ప్రజాసంఘాల జేఏసీ నాయకులు హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన స్థానంలోనే తిరిగి ఏర్పాటు చేయాలని అన్నమయ్య జిల్లా ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుండి నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా రాయచోటి తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటైన అంబేద్కర్ విగ్రహాన్ని రాత్రికి రాత్రే అపహరించారని దీనిపై రాయచోటి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరు మాయం చేశారో ఇంతవరకు పోలీసులు కనిపెట్టలేకపోయారని, రాయచోటి పట్టణ వ్యాప్తంగా దాదాపుగా 100 సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పట్టణ నడిబొడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని అపహరించిన వారి ఆచూకీ సీసీ కెమెరాలలో లేదని పోలీసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని జేఏసీ నాయకులు దుయ్యబట్టారు. పట్టణ నడిబొడ్డిలో అంబేద్కర్ విగ్రహం ఉంటే దళిత బడుగు బలహీన వర్గాలు చైతన్యవంతులై వారి హక్కులను గురించి నిలదీస్తారని భయపడుతున్న వారే ఈ దుర్మార్గానికి వడిగట్టారని అన్నారు. రాయచోటి పట్టణ కేంద్రం చుట్టూ వందల ఎకరాలు అన్యాక్రాంతం అవ్వడానికి సహకరిస్తున్న ఈ ప్రభుత్వ పాలకులు అధికారులు, భారత రాజ్యాంగ నిర్మాత జాతీయ నాయకుడు అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం కోసం అర సెంటు కూడా లేని జాగా ఇవ్వడానికి ఇష్టపడడం లేదని అన్నారు. రాయచోటి కోర్టు ఎదురుగా ఉన్న అరసెంటు జాగాలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినప్పటికీ ఎవరికీ ఎలాంటి నష్టం జరగదని వారన్నారు. కుల వ్యవక్ష కు ఇంతకు మించిన ఆధారాలు ఇంకేం కావాలని వారు అన్నారు. అనంతరం నిరాహార దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి జనసేన పార్టీ కోఆర్డినేటర్ రామ శ్రీనివాస్ మాట్లాడుతూ. అంబెడ్కర్ విగ్రహాన్ని దొంగలించన వారిని పట్టుకుని శిక్షించాలి.. అదేవిధంగా తొలగించిన స్తానంలోనే తిరిగి ప్రతిష్టించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేసిన రామ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రియాజ్, వశివుల్లా, శంకర్ జనసైనికులు ముశిరహ్మద్, రాజు, ఇర్ఫాన్, రామంజి, పఠాన్ పాల్గొన్నారు.