రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడిని ఖండించిన కిరణ్ రాయల్

పుంగనూరులో ప్రజా సమస్యలపై పోరాడుతున్న పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ ఇంటిపై ఆదివారం జరిగిన దాడిని జనసేన తరుఫున జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో కిరణ్ రాయల్ రామచంద్ర యాదవ్ ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామచంద్ర యాదవ్ కు అన్ని విధాలా జనసేన పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ కిరణ్ రాయల్ వెంట రాజారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ చైతన్య రాయల్, పుంగనూరు టౌన్ ప్రసిడెంట్ నరేష్ రాయల్, ఉపాధ్యక్షుడు నంద ప్రసాద్ మరియు కుప్పం జనసైనికులు ఉన్నారు.