అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి: అనుశ్రీ సత్యనారాయణ

  • జనసేన యువ నాయకులు బయ్యపునీడి సూర్య మిత్ర బృందం ఆధ్వర్యంలో ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమం
  • కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్ఛేసిన రాజమహేంద్రవరం అర్బన్ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ

రాజమండ్రి సిటీ: అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటరుగా నమోదు చేసుకోవాలని రాజమహేంద్రవరం జనసేన అర్బన్ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ అన్నారు. ఓటు నమోదుపై అవగాహన కల్పించేందుకు రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల వద్ద శుక్రవారం జనసేన యువ నాయకులు బయ్యపునీడి సూర్య మిత్ర బృందం ఆధ్వర్యంలో నూతన ఓటు నమోదు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనుశ్రీ సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం అనుశ్రీ మాట్లాడుతూ.. 17 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరు నూతన ఓటును నమోదు చేయించుకొవాలి అని అలాగే రాబోయే రోజుల్లో పారదర్శకమైన పాలన కొరకు ప్రతి ఒక్కరూ ఓటును కలిగి ఉండాలని దేశ రాష్ట్ర చరిత్రలను తిరగరాసే బాధ్యత యువతపై ఉందని 2024 సార్వత్రిక ఎన్నికల్లో నిస్వార్థ ప్రజా సేవకుడు జనసేన ని పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమించే ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని సి.ఎం ను చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తూ.గో.జిల్లా సంయుక్త కార్యదర్శి గెడ్డం నాగరాజు, రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబి, రాజమండ్రి నగర ప్రధాన కార్యదర్శి పైడిరాజు, నల్లంశెట్టి వీరబాబు కార్యదర్శులు అల్లాటి రాజు, విన్నవాసు, సంయుక్త కార్యదర్శులు దేవికవాడ చక్ర ఫణి, కురం అప్పారావు, జనసేన నాయకులు మొండేటి ప్రసాద్, మంచాల సునీల్, అడపా మణికంఠ, విక్టరీ వాసు, కుంది రాము, తుట్ట హేమ దుర్గ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.