తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ

తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో…అక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అన్ని పార్టీల దృష్టి ఇప్పుడు నాగార్జుసాగర్‌పై పడింది. అధికార టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ తరపున ఎవరు పోటీచేస్తారనేదానిపై అప్పుడే రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. నోముల నర్సింహయ్య, జానారెడ్డి వారసులు…ఏ పార్టీల నుంచి బరిలోకి దిగుతారనేదానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో టీఆర్ఎస్ ఈసారి ఆచితూచి వ్యవహరించేలా కన్పిస్తోంది. నాగర్జున్ సాగర్లో టీఆర్ఎస్ తరఫున గట్టి అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలున్నాయి. దీంతో బీజేపీ ఇప్పటి నుంచే నాగార్జున సాగర్లో ఆపరేషన్ ఆకర్ష్ షూరు చేసినట్లు కన్పిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘవీర్ రెడ్డితో బీజేపీ నేతలు చర్చించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

రఘువీర్ రెడ్డి కమలం గూటికి చేరితే నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికలో సీటు ఇస్తామని బీజేపీ పెద్దలు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రఘువీర్ రెడ్డి బీజేపీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ కు సైతం చెక్ పెట్టే అవకాశాలున్నాయి. రఘువీర్ పై జానారెడ్డి పోటీచేసే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఆ పార్టీ రేసులో వెనుకబడటం ఖాయంగా కన్పిస్తోంది.

దీంతో నాగార్జున్ సాగర్లో సైతం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొనే అవకాశం ఉంది. రఘువీర్ రెడ్డిని బీజేపీలో చేర్చుకోవడం ద్వారా అటూ కాంగ్రెస్.. ఇటూ టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని కమల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చే పార్టీ బీజేపీనే కావడంతో రఘువీర్ రెడ్డి సైతం కాషాయం కండువా కప్పుకునే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. అయితే రఘువీర్ హస్తం పార్టీకి హ్యండిచ్చి కమలం గూటికి చేరుతారా? లేదా అనేది మాత్రం వేచిచూడాల్సిందే.