తక్షణ నష్టపరిహారం ప్రకటించాలి.. పవన్ డిమాండ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివర్‌ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణ సాయంగా రూ.10 వేలు అందించాలని, ఎకరాకు రూ.35వేల పరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీలోని పలు జిల్లాల్లో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. తాము డిమాండ్ చేసినట్లుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోతే రేపు (డిసెంబరు 7న) అన్నిజిల్లాల్లో జనసేన నిరసన దీక్షలు చేపడుతుందని హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలోని కోవూరు.. గూడురు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్.. రైతులు.. చేనేతల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎకరాకు రూ.35వేల పరిహారం జనసేన డిమాండ్‌ కాదని, అనేక మంది రైతుల డిమాండ్ అని చెప్పారు పవన్. తక్షణ సాయం ప్రకటించి ఎకరాకు రూ.35వేల పరిహారం జనసేన డిమాండ్‌ కాదని, అనేక మంది రైతుల డిమాండ్ అని చెప్పారు పవన్.

ఈ సందర్భంగా పవన్ కొన్ని పవర్ ఫుల్ పంచ్ లు వేశారు. రాష్ట్రంలో విడతల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి.. చివరకు ప్రభుత్వమే మద్యాన్ని అమ్మటాన్ని తప్పు పట్టారు. బూమ్.. సుప్రీం.. ప్రెసిడెంట్ మెడల్.. ఆంధ్రా గోల్డ్ అంటూ కొత్త కొత్త బ్రాండ్లతో మద్యాన్ని అమ్ముతున్నారన్నారు. బంగారు తెలంగాణ విన్నాం కానీ బంగారు ఏపీ అంటూ మద్యానికి బ్రాండ్ పేరుగా పెట్టటం ఏమిటని ప్రశ్నించిన ఆయన.. ఆంధ్రా గోల్డ్ అంటే అది మద్యం బ్రాండ్ అని తాను అనుకోలేదన్నారు. చిత్రవిచిత్రమైన పేర్లతో మద్యం బ్రాండ్లను తీసుకొస్తున్న ప్రభుత్వ తీరును తప్పుపట్టిన పవన్ కల్యాణ్.. సీఎం మెడల్.. వైసీపీ స్పెషల్ లాంటి పేర్లు పెట్టి మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకోవాలంటూ మండిపడ్డారు.