లంక గ్రామాల్లో బండారు శ్రీనివాస్ సుడిగాలి పర్యటన

  • జనసేన కొత్తపేట నియోజకవర్గం రథసారథి! బండారు శ్రీనివాస్ లంక గ్రామాలైన చొప్పెల్ల, చెముడు లంక, నర్సిపూడి సుడిగాలి పర్యటన! పలువురిని ఓదార్పు! పరామర్శ! హార్షం వ్యక్తం చేస్తున్న పలు గ్రామాల ప్రజలు.
  • కుటుంబ పెద్దలు దూరమై, కష్టకాలంలో ఉన్నవారికి అండగా నిలిచేవారు ఒక జనసైనికులేనని నిరూపిస్తున్న బండారు శ్రీనివాస్ కు పలువురు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ.. ముందుకు సాగనంపారు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరు మండలంలోని లంక గ్రామాలైన చెముడులంక, చోప్పెల్ల నర్సిపూడి, పలు గ్రామాలలో కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ సుడిగాలి పర్యటనతో కష్టకాలంలో ఉన్న పలు కుటుంబాలను, పలువురిని పరామర్శ చేసి ఓదార్పు అందించి ఉన్నారు. ఇటీవల కాలంలో కుటుంబ పెద్దలను కోల్పోయిన వారికి ధైర్యంగా ఉండాలని కోరుతూ, ఎల్లవేళలా ఒక కుటుంబ సభ్యుని వలే ఎలాంటి కష్టాల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న మీకు మేము అండగా ఉంటామని, మీ వెనుక జనసేన కుటుంబం ఉన్నదని, కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచే గొప్ప నాయకుడు ఒక జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రమేనని వారి ఆశయాలే మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాయని, ధైర్యాన్ని కోల్పోవద్దని ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని బండారు శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా వారి వెంట పాల్గొన్న పలువురు ప్రముఖులు, జనసైనికులు, తాళ్ల డేవిడ్ రాజు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆలమూరు మండల ప్రముఖ యువ నాయకులు కొత్తపల్లి నగేష్, సోము పోతురాజు, నాగిరెడ్డి మహేష్ సురపురెడ్డి సత్య ఆలమూరు జనసేన అధ్యక్షులు, మూలస్థానం యువ నాయకులు సలాది జయప్రకాష్ నారాయణ (జెపి) పలువురు జనసైనికులు, కార్యకర్తలు వారి అడుగులో అడుగు వేసి పలు కుటుంబాలకు పరామర్శలో భాగంగా పాల్గొన్నారు.